Hyderabad : చనిపోయినా మూడు రోజులు ఇంట్లోనే మృతదేహం

ఆరోగ్యం క్షీణించి కుటుంబ యజమాని మృతిచెందడం ఆ కుటుంబంపై తీవ్రమైన భారంగా మారింది.

Update: 2025-12-07 04:53 GMT

ఆరోగ్యం క్షీణించి కుటుంబ యజమాని మృతిచెందడం ఆ కుటుంబంపై తీవ్రమైన భారంగా మారింది. అంత్యక్రియల ఖర్చు కూడా లేకపోవడంతో మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచేశారు. ఇంటివాళ్లు బయటకు కనిపించకపోవడంతో ఇంటి యజమాని పోలీ‌సులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తరువాత ఒక స్వచ్ఛంద సంస్థ వచ్చి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ గద్దం మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం...

ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ...
మహబూబ్‌నగర్ జిల్లా చెంతకు చెందిన స్వామిదాస్‌ (76) కుటుంబంతో కలిసి శాపూర్ నగర్‌లోని ఎన్ఎల్‌బీ నగర్‌లో నివసిస్తున్నాడు. చిన్న కుమార్తె సలోని ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేది. తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో మూడు నెలల క్రితం ఉద్యోగం మానేసి ఇంట్లోనే సేవచేస్తోంది. తండ్రి పరిస్థితి రోజురోజుకీ దిగజారడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. ఇదే సమయంలో సోమవారం స్వామిదాస్ మృతిచెందాడు. అంత్యక్రియలకు రూపాయి కూడా లేకపోవడంతో కుటుంబం మృతదేహంతో ఇంట్లోనే ఉండిపోయింది.
స్వచ్ఛంద సంస్థ సహకారంతో...
గురువారం ఇంటివాళ్లు బయటకు రాకపోవడంతో అనుమానించిన స్థానికులు ఇంటిని చూసి పరిస్థితి తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.శుక్రవారం సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ అంత్యక్రియలు నిర్వహించింది. తరువాత రాంపగల్‌పేట్‌లోని హోమ్ ఫర్ ద్ డిసేబుల్డ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆ కుటుంబానికి తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. ఆర్థికభారం లేక తన కుటుంబ పెద్ద మరణించినా అంత్యక్రియలు జరపలేకపోవడంతో స్వచ్ఛంద సేవా సంస్థ సాయంతో నిర్వహించామని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News