అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి
అమెరికాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తెలంగాణకుచెందిన విద్యార్థిని మృితి చెదారు..
అమెరికాలో శుక్రవారం రాత్రి అపార్ట్‌మెంట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మరణించారు. పలువురు గాయపడ్డారు. అలబామా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య చేస్తున్నారు పది మంది విద్యార్థులు అక్కడే ఉంటున్నారు. రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కాసేపులోనే దట్టమైన పొగ అపార్ట్‌మెంట్‌ను కమ్మేసింది. శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడడంతో విద్యార్థులు బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించారు.
చికిత్స పొందుతూ...
అగ్నిమాపక దళాలు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని భవనంలో చిక్కుకున్న 13 మంది విద్యార్థులను బయటకు తీసుకువచ్చాయి. తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అయితే వైద్య ప్రయత్నాలు ఫలించకపోవడంతో హైదరాబాద్‌కు చెందిన సహజ రెడ్డిచికిత్స పొందుతూ మృతి చెందారు.స్థానిక అధికారులు, తెలుగు సంఘాలు, విశ్వవిద్యాలయ ప్రతినిధులు విద్యార్థులకు సహాయం అందిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.