Telangana Glabal Summit : గ్లోబల్ సమ్మిట్ లో పసందైన విందు.. అతిధులు ఆవురావుమని తినేలా? ఇదే మెనూ
Telangana Glabal Summit : గ్లోబల్ సమ్మిట్ లో పసందైన విందు.. అతిధులు ఆవురావుమని తినేలా? ఇదే మెనూ
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే అతిధుల కోసం పసందైన విందును ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి విందులో తెలంగాణ స్పెషల్ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ, హైదరాబాద్ లో ప్రసిద్ధి గాంచిన వంటకాలను దేశ, విదేశీ ప్రతినిధులకు రుచి చూపించేందుకు అన్ని రకాల సంప్రదాయ రుచులతో కూడిన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూ చర్ సిటీలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. మొత్తం 44 దేశాల నుంచి 54 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. దేశానికి చెందిన ప్రముఖులు కూడా హాజరు కానున్న నేపథ్యంలో వారందరికీ తెలంగాణ రుచులను అందించాలన్న లక్ష్యంతోనే చేయి తిరిగిన వంటగాళ్లతో వంటకాలను సిద్ధం చేస్తున్నార.
సంప్రదాయ వంటకాలు...
ఇప్పటికే తెలంగాణ సంప్రదాయ వంటకాలు సిద్ధమవుతున్నాయి. లంచ్ తో పాటు మధ్యాహ్నం స్నాక్స్ తో పాటు రాత్రికి విందులో కూడా తెలంగాణ రుచులను అందించేందుకు ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశారు. తెలంగాణలో నోరూరించే వంటకాలను విదేశీ, దేశీయ ప్రతినిధులకు రుచి చూపించి ఫుడ్ విషయంలోనూ గ్లోబల్ సమ్మిట్ హైలెట్ గా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిపుణులైన వంటగాళ్లను రప్పించి వారి కోసం ప్రత్యేకంగా పసందైన రుచులతో కూడిన తెలంగాణ వంటకాలను సిద్ధం చేస్తున్నారు. నోటికి రుచిగా, జిహ్వచాపల్యంతో వచ్చే వారికి కడుపు నిండుగా ఆవురావుమని తినేలా ఈ రుచులను తెలంగాణకు చెందిన వంటకాలు సిద్ధమవుతున్నాయి.
మధ్యాహ్నం, స్నాక్స్, విందులోనూ...
తెలంగాణలో అత్యంత పేరున్న హైదరాబాద్ బిర్యానీతో పాటు హైదరాబాద్ కాషాన్ దమ్ బిర్యానీ, పాయా, పత్తర్ ఖా ఘోష్, మటన్ కర్రీ, మలిడలు, గరిజాలు, గోలిచిన మమ్సం, పోలేలు, ఖుర్బానీకా మీఠా, తుంటి కూర, చికెన్, చేపలు, రొయ్యలు వంటి వాటితో పాటు శాఖాహారమైన విందును కూడా సిద్ధం చేస్తున్నారు. మామిడికాయ పప్పు, వంకాయ కర్రీ, చిక్కుడు కాయ ఫ్రై, సాంబారు, రసం, పచ్చిపులుసు, ఆకు కూర పప్పుతో పాటు అనేక రకాల కాయగూరలతో వంటలను సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం స్నాక్స్ కింద సకినాలు, నువ్వుల లడ్డూలు, గారెలు, మక్క పేలాలు, సర్వపిండి వంటివి కూడా అతిధులకు అందించనున్నారు. తెలంగాణ ఆహార సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వంటకాలను సిద్ధం చేస్తున్నారు.