మూసారాంబాగ్ వంతెన మూసివేత
మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో ముసారాంబాగ్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు
మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతుంది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి మూసీకి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో మూసీ వరద ఉధృతితో ముసారాంబాగ్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. ఎగువ రాష్ట్రాల్లోనూ, తెలంగాణలోనూ కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నదికి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేశారు.
రెండు వైపులా బారికేడ్లను...
బ్రిడ్జికి రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. గోల్నాక మీదుగా వాహనాలను దారిమళ్లిస్తున్నారు. మూసారం బాగ్ వద్ద కొత్త వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో తరచూ ఈ ప్రాంతంలో మూసీనది పొంగి ప్రవహిస్తుందని, రాకపోకలకు అంతరాయం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. త్వరగా కొత్త వంతెన పూర్తి చేయాలని కోరుతున్నారు.