Hyderabad : హైదరాబాద్ లో ఈరోజు అటువైపు వెళ్లకండి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. గ్లోబల్ సమ్మిట్ కు వెళ్లేందుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు వెళ్లనుండటంతో పాటు ఈరోజు తమ కంపెనీలకు వెళ్లేందుకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా రోడ్లపైకి వచ్చారు. దీంతో భారీగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అనేక వాహనాలు ముందుకు కదలకుండా చాలా సేపు ఉండిపోయాయి. ఒక కారు బ్రేక్ర డౌన్ కావడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
భారీగా ట్రాఫిక్ జాం...
ఐటీ ఉద్యోగులు ఒక్కసారిగా రావడంతో ఈ సమస్యలు ఏర్పడ్డాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ రూం నుంచి సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. బారులు తీరిన వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ మార్గం నుంచి వచ్చే వారు ప్రత్యామ్నాయ మార్గం నుంచి వెళ్లడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.