Hyderabad : శంషాబాద్ లో విమానానికి బాంబు బెదిరింపు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లే విమానంలో బాంబు పెట్టామని మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే విమానం టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే బాంబు పేలుస్తానని మెయిల్ లో పేర్కొన్నాడు. బాంబు పేల్చకూడదు అంటే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలంటూ ఆగంతకుడు డిమాండ్ చేశారు.
తనిఖీలు నిర్వహించడంతో...
దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు వెంటనే విమానంలో బాంబు స్క్కాడ్ తో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ మెయిల్ అమెరికా న్యూయార్క్ నుంచి జాస్పర్ పకార్డ్ అనే వ్యక్తి నుంచి వచ్చినట్లు గుర్తించారు. చివరకు బాంబు బెదిరింపు ఉత్తిత్తిదేనని తేల్చిన అధికారుల ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.