Gold Price Today : బంగారంపై భ్రమలు వీడండి.. మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి.
బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయి. తగ్గడం అనేది అరుదుగానే జరుగుతుంది. బంగారం ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎన్నడూ జరగలేదు. దీంతో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. బంగారం విషయంలో సెంటిమెంట్ ఉండటంతో భారతీయులు ధరలు భారీగా పెరిగినప్పటికీ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. కొద్దిగా ఖర్చు ఎక్కువయినప్పటికీ బంగారాన్ని తమ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా భావించి కొనుగోలు చేస్తుంటారు. అందుకే బంగారానికి, వెండి వస్తువులకు ఎన్నడూ డిమాండ్ తగ్గదు. జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం కూడా బంగారం ధరలు పెరిగినప్పటికీ తమకు గిరాకీ పెద్దగా తగ్గలేదని అంటున్నారు.
కొనుగోలు విషయంలో...
ఇందుకు కారణం బంగారాన్ని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. బంగారం తమ వద్ద ఉంటే భరోసా ఉంటుందని భావించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా ఎక్కువగా బంగారంపైనే పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకున్నారు. దీంతో బంగారం విషయంలో ధరలు పెద్దగా వ్యాపారులను ఆందోళనలకు గురి చేయడం లేదని చెబుతున్నారు. కానీ గత సీజన్ లో బంగారం, వెండి వస్తువులు భారీగా అమ్ముడయ్యాయి. కానీ గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో మాత్రం చాలా వరకూ తగ్గినట్లు వ్యాపారులు అంగీకరిస్తున్నారు. మరొకవైపు జ్యుయలరీ దుకాణాలు అనేక ఆఫర్లు, కొత్త కొత్త డిజైన్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
స్వల్పంగా పెరిగి...
బంగారం విషయలో ఎలాంటి అపోహలు వద్దని, భారీగా పతనం అవ్వడం జరగదని, ఎప్పుడు చేతిలో డబ్బులుంటే అప్పుడే కొనుగోలు చేయమని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,560 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,430 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,98,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.