హైదరాబాద్ కాంగ్రెస్ హోర్డింగ్ లు.. కలకలం

హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.

Update: 2025-01-25 11:41 GMT

హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన హోర్డింగ్ లు నగరంలో చర్చనీయాంశంగా మారాయి. పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ విన్నూత్న ప్రచారానికి దిగింది. కేసీఆర్,కేటీఆర్ లకు ఈనో ప్యాకెట్లు పంపుతూ ఈ హోర్డింగ్ లను కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు.

కడుపు మంటకు ఈనో వాడాలంటూ...
హైదరాబాద్ వ్యాప్తంగా బ్యానర్లు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కడుపు మంట తగ్గేందుకు బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు వాడాలంటూ,హైదరాబాద్ లో భారీగా హోర్డింగ్ లు కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి 1,79 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకు వచ్చినందుకు కడుపు మంటతో రగిలిపోతున్నారని ఈ హోర్డింగ్ లను కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News