సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్లు.. ఇక కష్టమే
సంక్రాంతి పండగకు వెళ్లేందుకు ఇప్పటికే రైల్వే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.
సంక్రాంతి పండగకు వెళ్లేందుకు ఇప్పటికే రైల్వే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. దాదాపు అన్ని రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయినట్లు ఛార్ట్ లు చూపిస్తున్నాయి. ఎక్కువగా హైదరాబాద్ నుంచి విశాఖ, విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ముందస్తు రిజర్వేషన్ల దాదాపు ముగిసిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు.
సొంతూళ్లకు వెళ్లేందుకు...
సంక్రాంతి పెద్ద పండగ కావడంతో అందరూ సొంత ఊళ్లకు వెళ్లేందుకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి పండుగకు నగరంలోని ప్రముఖమైన కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ ల నుంచి వెళ్లే అన్ని రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్‌లు కనబడుతున్నాయి. పండుగను తమ సొంతూళ్లలో జరుపుకోవడానికి నగరవాసులు రెండు నెలల ముందుగానే టిక్కెట్లను రిజర్వేషన్ చేయించుకున్నారు.