Hyderabad : కోకాపేట ఈ వేలం.. ఈ సారి ధర ఎంతో తెలుసా?

హైదరాబాద్ లోని కోకాపేట భూములకు మరోసారి రికార్డు ధర పలికింది

Update: 2025-12-03 13:49 GMT

హైదరాబాద్ లోని కోకాపేట భూములకు మరోసారి రికార్డు ధర పలికింది. ఈరోజు నిర్వహించిన ఈ వేలంలో ఎకరం 131 కోట్ల రూపాయలు పలికింది. మొత్తం ఎనిమిది ఎకరాలను మూడో విడత వేలం వేశారు. ప్లాట్ నెంబరు 19లో ఎకరానికి 131 కోట్లు పలికింది. ప్లాట్ నెంబరు 20 ఎకరం 118 కోట్ల రూపాయలు పలికింది. ఈ రోజు హైదరాబాద్ మెట్రో డెవలెప్ మెంట్ అథారిటీకి వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం లభించింది.

మూడు విడతలుగా...
ఇప్పటి వరకూ హెచ్ఎండీఏకు మూడు విడతలుగా జరిగిన వేలంలో దాదాపు 3,700 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇరవై ఏడు ఎకరాలకు 3,700 కోట్ల రూపాయలు ధర లభించడంలో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. కోకాపేట్, మూసపేట్ లోని మరికొన్ని ఎకరాలకు ఈ నెల 5వ తేదీన హెచ్ఎండీ మరోసారి వేలం నిర్వహించనుంది.


Tags:    

Similar News