Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదట

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.

Update: 2025-12-05 05:29 GMT

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. అందుకు తగినట్లుగానే ప్రతి రోజూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం ఇక కొందరికే సొంత మవుతుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. బంగారం ..ఒకరకంగా మధ్యతరగతి వాసులకు కూడా అందకుండా ఉండటానికి, ధరలు విపరీతంగా పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, విధించిన అదనపు సుంకాలు, డాలర్ బలపడటం వంటివి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

ఈ ధరలతో...
బంగారం అంటే ఇప్పుడు అందరి వస్తువు కాదు. కొందరికే పరిమితమయింది. గత కొద్ది రోజులుగా బంగారం ధర పది గ్రాములు లక్షన్నర రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర రెండు లక్షలు దాటేసింది. ఇక రానున్న కాలం కూడా బంగారం, వెండి కొనుగోలు చేయడం కష్టమేనని అంటున్నారు. కేవలం సంపన్నులకు మాత్రమే వాటిని కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది. మరొకవైపు బంగారం, వెండి వస్తువులు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎంచుకుంటున్నారు. వన్ గ్రామ్ గోల్డ్ ను ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. మరొకవైపు పెట్టుబడి పెట్టే వారు సయితం బంగారం, వెండిపై కాకుండా మరొక చోట పెడుతున్నారు.
మరో రెండు నెలలు...
ఇక పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా మరో రెండు నెలల పాటు ఉండవు. మూఢమి నడుస్తుండటంతో బంగారం, వెండి ఆభరణాల కొనుగోలు మాత్రం ఈ రెండు నెలలు ఉండవు. అయితే ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 930 రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,18,840 రూపాయలుగా నమోదయింది 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,29,650 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,99,900 రూపాయలుగా నమోదయింది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.










Tags:    

Similar News