Indigo : నేడు కూడా విమానాలు ఎగరవట

ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు

Update: 2025-12-06 02:24 GMT

ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈరోజు కూడా అనేక విమానాలు రద్దయ్యే అవకాశముంది. పైలట్ల కొరతతో పాటు సాంకేతిక కారణాలతో విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో విమానయాన సంస్థ తెలిపింది. డీజీసీఏ నిబంధనల మేరకు పైలెట్లకు వారాంతపు సెలవులు ఇవ్వాల్సి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. అయితే డీజీసీఏ తాము విధించిన నిబంధనలను సవరించినప్పటికీ ఇంకా ఇండిగో విమాన సర్వీసులు పునరుద్ధరించేందుకు మరికొన్ని రోజుల సమయం పడుతుందని ఆ సంస్థ ప్రతినిదులు తెలిపారు.

ప్రయాణికుల భద్రత కోసమే...
ఈరోజు కూడా అత్యధిక సంఖ్యలో విమానాలు రద్దయ్యే అవకాశముంది. ప్రయాణికుల భద్రత కోసమే డీజీసీఏ ఈ నిబంధనలను తీసుకు వచ్చింది. పైలెట్లు అలసట పొండకుండా విశ్రాంతి తీసుకునేందుకు 36 గంటల నుంచి 48 గంటల సమయాన్ని పెంచింది. తాత్కాలికంగా డీజీసీఏ నిబంధనను ఉసంహరించుకున్నప్పటికీ దేశంలో అతిపెద్దదైన ఇండిగో విమాన యాన సంస్థకు పైలెట్ల కొరత ఉండటంతో పూర్తిగా పరిస్థితి మెరుగుపడేందుకు మరి కొద్దిరోజుల సమయం ఉందని చెబుతున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మరోఐదు నుంచి పది రోజుల సమయం పడుతుందని ఇండిగో విమానయాన సంస్థ ప్రతినిధులు చెప్పారు.
పోలీసులు పరిశీలన...
ఇండిగో విమాన సర్వీసులు రద్దుపై శంషాబాద్ ఎయిర్ పోర్టులో సైబరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. చెక్‌ఇన్ కౌంటర్లు, గేట్లు పరిశీలించిన అధికారులుపీక్‌ అవర్స్‌లో ప్రయాణికులకు సౌకర్యం చూడాలని సూచించారు. ఇండిగో విమానాల రద్దులతో ఏర్పడిన పరిస్థితులను పరిశీలించేందుకు సైబరాబాద్ పోలీసు అధికారులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. విమానాశ్రయంలోని చెక్‌ఇన్ కౌంటర్లు, బోర్డింగ్ గేట్లు, ప్రయాణికుల కదలికలను పరిశీలించారు. ఇండిగో రీజినల్ మేనేజర్ విమానాల రద్దుకు దారితీసిన ఆపరేషనల్ సమస్యలను అధికారులకు వివరించారు. పరిస్థితులు సాధారణం కావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పీక్ అవర్స్‌లో ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చూడాలని, స్టేషన్ సిబ్బందికి అధికారులు సూచించారు.






Tags:    

Similar News