Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్టులో శరణు ఘోష
ఇండిగో విమానం రద్దు కావడంతో శబరిమలకు వెళ్లాల్సిన భక్తులు శుక్రవారం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు
ఇండిగో విమానం రద్దు కావడంతో శబరిమలకు వెళ్లాల్సిన భక్తులు శుక్రవారం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు.గురువారం సాయంత్రం నుంచే ఆ విమానం ఎప్పుడు బయలుదేరుతుందన్న స్పష్టమైన సమాచారం రాకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. భక్తులు తమ ప్రయాణాలు రద్దు కావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను సురక్షితంగా కొచ్చికి పంపేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.. “స్వామియే శరణం అయ్యప్ప” శంషాబాద్ విమానాశ్రయం నినాదాలతో మార్మోగింది.
విమానాల రద్దుతో...
మరొకవైపు ఇండిగో్ విమానాలు రద్దు కావడంతో ఇతర విమానసర్వీసులకు టిక్కెట్ల రేట్లు విపరీతంగా పెరిగాయి. వందల సంఖ్యలో ఇండిగో ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో దేశీయ విమాన టికెట్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఢిల్లీ నుంచి లండన్ టికెట్ ధర రూ.25వేలు ఉంటే ఢిల్లీ నుంచి కొచ్చి టికెట్ ధర ఏకంగా రూ.40వేలకు పెంచేశారు. ఇది సాధారణంగా రూ.5,000 నుంచి రూ.10,000 మధ్య ఉంటుంది. ఢిల్లీ నుంచి ముంబై టికెట్ ధర రూ.40,452కు పెరిగింది. అత్యవసరంగా వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రేట్లు పెంచవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే విమానయాన సంస్థలు ప్రభుత్వహెచ్చరికలను పట్టించుకోవడం లేదు.