Gold Prices Today : రికార్డు బ్రేక్ చేస్తున్నాయిగా.. బంగారంపై ఆశలు వదులుకోండిక
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వెండి ధరలు కిలో రెండు లక్షల రూపాయలకు చేరుకుంది. బంగారం ధరలు ఇక ఆగవని అందరికీ అవగతమయింది. బంగారంపైన ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెండి ధరలు అందుబాటులోకి లేవు. ఇక రెండు ఆభరణాలను కొనుగోలు చేయడం కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే విపరీతంగా పెరిగిపోయిన బంగారం, వెండి ధరలతో మధ్యతరగతి, వేతన జీవులకు మాత్రం ఈ వస్తువులు దూరమయినట్లే. అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ రేంజ్ లో ధరలు పెరగడం గతంలో ఎన్నడూ లేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు.
అనేక కారణాలతో...
బంగారం ధరలు పది గ్రాములు లక్షన్నర రూపాయలకు చేరుకునేందుకు దూకుడుగా పరుగులు తీస్తుంది. కిలో వెండి ధర రెండు లక్షల రూపాయలు దాటేసింది. గతంలో వెండి ధరలు దిగి వచ్చినప్పటికీ మళ్లీ రెండు లక్షలు చేరుకుని రికార్డు బ్రేక్ చేసేసింది. డాలర్ తో రూపాయి తగ్గుదల, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ మరింత బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోత, అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న పరిస్థితులు బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశముందని బిజినెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం ధరలు ఇక తగ్గవని కూడా చెబుతున్నారు.
భారీగా పెరిగి...
ప్రస్తుతం మూఢమి కాలం నడుస్తుండటంతో కొనుగోళ్లు కూడా నిలిచిపోయి బంగారం, వెండి ఆభరణాలకు డిమాండ్ తగ్గింది. దీంతో పాటు ధరలు పెరుగుదల కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 650 రూపాయలు పెరిగింది. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,19,710 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,590 రూపాయలకు చేరుకుంది.కిలో వెండి ధర 2,01,100 రూపాయలుగా ట్రేడ్ అయింది. మధ్యాహ్నానికి ధరలలో మరింత మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.