IBomma Ravi : ఐబొమ్మ రవి షాకింగ్ డెసిషన్.. పోలీసులు కంగుతిన్నారుగా?

ఐబొమ్మ రవిని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు

Update: 2025-12-04 05:23 GMT

ఐబొమ్మ రవిని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే ఎనిమిదిరోజులు ఐబొమ్మ రవిని పోలీసులు విచారించారు. ఈసందర్భంగా రవికి సైబర్ క్రైమ్ పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. తమకు సహకరిస్తే సైబర్ క్రైమ్ పోలీసు విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారని సమాచారం. అయితే రవి నుంచి సమాచారాన్ని సేకరించడానికే పోలీసులు ఈ ప్రతిపాదన పెట్టారా? లేక సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టేందుకు ఇమ్మడి రవి సహకారం ఉంటుందని భావించి నిజంగానే ఈ హామీని ఇచ్చారా? అన్నది మాత్రం తెలియరాలేదు.

తన ముందుంచిన ప్రతిపాదనలను..
మరొకవైపు పోలీసులు తన ముందుంచిన ఈ ప్రతిపాదనను ఐబొమ్మ రవి సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఇకపై తాను ఐబొమ్మను నిర్వహించనని, పైరసీని చేయనేని, తన ఫ్యూచర్ ఏంటో కూడా రవి పోలీసుల ఎదుట చెప్పినట్లు తెలిసింది. ఐ బొమ్మ రవికి కరేబియన్ దీవుల్లో పౌరసత్వం ఉంది. దీంతో తానుఅక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నానని పోలీసులతో స్పష్టం చేసినట్లు తెలిసింది. తాను అక్కడ పైరసీ కాకుండా మంచి ఫుడ్ బిజినెస్ ను స్టార్ట్ చేసే ఆలోచన చేస్తున్నానని రవి పోలీసులకు తెలపారని అంటున్నారు.
నేడు మరోసారి కస్టడీ పిటీషన్...
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను మంచి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానని, అది కూడా కరేబియన్ దీవుల్లోనే రెస్టారెంట్ ఓపెన్ చేయాలని భావిస్తున్నట్లు రవి వెల్లడించినట్లు తెలిసింది. రవి భారత్ లో ఉండేందుకు ఇష్టపడటం లేదు. అలాగే ఐ బొమ్మ రవిపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. అయితే హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా రెస్టారెంట్ ఏర్పాటు చేస్తానని కూడా రవి చెప్పినట్లు తెలిసింది. ఈరోజు నేడు మరోసారి పోలీసులు ఐ బొమ్మ రవిని కస్టడీకి కోరనున్నారు. నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణకు రానుంది. మరొకవైపు నేడు రవి బెయిల్ పిటీషన్ పై కూడా విచారణ జరగనుంది.


Tags:    

Similar News