ఏపీ సీఎం వైఎస్ జగన్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అంత ప్రత్యేకమైనదా..?

ప్రాజెక్టు కోసం 3 బిలియన్ యుఎస్ డాలర్లు పెట్టుబడి పెడ్తున్న గ్రీన్ కో గ్రూప్ సంస్థ. ఒకే యూనిట్‌ నుంచి సోలార్..

Update: 2022-05-17 08:39 GMT

అమరావతి : ప్రపంచంలోనే మొట్ట మొదటగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఫస్ట్ కాంక్రీట్ పోర్ కార్యక్రమానికి ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి సీఎం జగన్ ఉ.11:17 గంటలకు గుమ్మటం తాండ హెలిప్యాడ్ కు చేరుకున్నారు. ఆయనతో పాటూ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవర్‌ ప్రాజెక్ట్‌ త్రీడీ మోడల్‌ నమూనాను ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ వద్ద పైలాన్ ను ఆవిష్కరించిన అనంతరం కాంక్రీటు వేసి ప్రాజెక్ట్ పనులను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

ప్రాజెక్టు కోసం 3 బిలియన్ యుఎస్ డాలర్లు పెట్టుబడి పెడ్తున్న గ్రీన్ కో గ్రూప్ సంస్థ. ఒకే యూనిట్‌ నుంచి సోలార్, విండ్, హైడల్‌ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 5,230 మెగావాట్ల ఉత్పత్తి చేస్తారు. గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 2,800 ఎకరాలను కంపెనీకి అప్పగించింది. ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి 3000 మెగావాట్లు, విండ్‌ 550 మెగావాట్లు, హైడల్‌ పవర్‌ 1860 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో స్థాపించే ఈ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుంటే 23 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల లభిస్తాయి. అంతేకాక స్థానికంగా ఉన్న పరిశ్రమలు, హోటళ్లలో విద్యుత్‌ కోతలకు చెక్‌ పెట్టవచ్చు.
మొత్తం 5,410 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నేషనల్‌ గ్రిడ్‌కు అనుసంధానించి ఓరక్వల్లు పీజీసీఐఎల్‌/సీటీయూ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ద్వారా దేశంలోని డిస్కామ్‌లు, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో స్థాపించే ఈ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 23 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.


Tags:    

Similar News