అమరావతిపై కూటమిది ప్రచార ఆర్భాటమే

అమరావతిపై కూటమి ప్రభుత్వానిది కేవలం ప్రచార ఆర్భాటమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు

Update: 2026-04-04 12:13 GMT

అమరావతిపై కూటమి ప్రభుత్వానిది కేవలం ప్రచార ఆర్భాటమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు.ప్రత్యేక హోదా తెస్తే పది అమరావతులు వస్తాయన్నారు. ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని బొత్స ప్రశ్నించారు. రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రీయింబర్స్ మెంట్ లేక విద్యార్థులు అల్లాడుతున్నారన్న బొత్స ప్రజా సమస్యల కంటే చంద్రబాబుకు కాంక్రీట్ పనులపైనే తాపత్రయం ఎక్కువని చెప్పారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,గిట్టుబాటు ధర లేక రైతులు, ఫీజు రీయింబర్స్ మెంట్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అమరావతిలో కాంక్రీట్ వేశామని అనిపించుకోవడానికే చంద్రబాబు ఆరాటపడుతున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలను మీడియా పట్టించుకోకపోవడం దారుణమన్న బొత్స ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందని తెలిపారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.

తీర్మానాలతో పర్మినెంట్ అనుకుంటే...
అమరావతిని కేవలం తీర్మానాలతో పర్మినెంట్ అనుకుంటే పొరపాటే.. నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర విభజన హామీల గురించి కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా వస్తే ముంబై వంటి నగరాలు, పది అమరావతులు రాష్ట్రానికి వస్తాయని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లను కూడా ఈ రెండేళ్లలో పూర్తి చేయలేకపోయారని అన్నారు. కనీసం కరకట్ట రోడ్డు కూడా వేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. రెండేళ్ల కాలంలో క్లాస్ ఫోర్ ఉద్యోగులకు ఇళ్లు ఎందుకు పూర్తి చేయలేదని, అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో చెప్పడానికి ప్రభుత్వానికి టైమ్ బాండ్ లేదని, గతంలో 2014-19 మధ్య చంద్రబాబు కేవలం 5 శాతం పనులే చేశారని, ఈ రెండేళ్లలో అమరావతిపై ఎంత ఖర్చు చేశారని, ఎంత పని చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. అమరావతి నిర్మాణంలో చదరపు అడుగుకు 14 వేల రూపాయల ఖర్చుపై అనుమానాలు వస్తున్నాయని అన్నారు. గిరి గీసుకుని అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తామంటే కుదరదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఒక్క రోజు కూడా ఆగలేదని, అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అదనంగా చేసిన మేలు ఏంటో చెప్పాలని నిలదీశారు.


Tags:    

Similar News