Breaking : గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకుల గల్లంతు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. గోదావరి నదిలోకి దిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు

Update: 2026-04-04 12:43 GMT

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. బొబ్బర్లంక వద్ద గోదావరి నదిలోకి దిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రాజమండ్రి సమీపంలో ఈ ఘటన జరిగింది. నలుగురు యువకులు నదిలో స్నానానికి వెళ్లారు. అందులో ముగ్గురు గల్లంతయ్యారు. ఒకరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డారు.

రాజమండ్రి జాంపేటకు చెందిన...
వీరంతా రాజమండ్రి జాంపేటకు చెందిన యువకులుగా గుర్తించారు. గోదావరి నదిలో లోతుగా ఉండటం గమనించని యువకులు, బోర్డులు ఏర్పాటు చేసినా పట్టించుకోకుండా నదిలో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక మృతదేహం లభ్యమయింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News