Nara Lokesh : నేడు కర్ణాటకకు లోకేశ్
నేడు మంత్రి లోకేశ్ కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సింధనూరు పర్యటించనున్నారు
నేడు మంత్రి లోకేశ్ కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సింధనూరు పర్యటించనున్నారు. ఉదయం కర్ణాటకలోని సింధనూరుకు చేరుకుని ఎంజీ సర్కిల్ నుంచి గంగావతి రోడ్డు వరకు బైక్ ర్యాలీలో పాల్గొంటారు. హోసల్లీ క్యాంప్ గంగావతి రోడ్డులోని కమ్మవారి కళ్యాణ మండపంలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డీ కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్ సేథ్తో కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని...
అనంతరం హోసల్లీ క్యాంప్ లో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కర్ణాటకలో ఎన్టీఆర్, టీడీపీ అభిమానులంతా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.