పోలీసులపై పేర్ని నాని మాస్ ర్యాగింగ్
పోలీసులపై పేర్ని నాని మాస్ ర్యాగింగ్ చేశారు
కృష్ణా జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు జైపాల్ పై పేర్ని నాని మాస్ ర్యాగింగ్ చేశారు. మీరు ఏకవచనంతో మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. తండ్రి వయసుంటే ఏం పీక్కుంటారో పీక్కోండి సిఐ అనొచ్చా అని ప్రశ్నించారు. గత వైసిపి ప్రభుత్వంలో మచిలీపట్నంలో సిఐ పరమేశ్వర్ ఎప్పుడు పనిచేశారన్నారi. వైసిపి ప్రభుత్వంలో ఏ పేదవాడి ఇంటిని తాము కొట్టించామన్నారు. తాము ఏ పేదవాడి ఇంటిని కూలగొడుతుంటే ఈ సిఐ వచ్చి బందోబస్తు ఇచ్చారని మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు.
ఏకవచనంతో మీరు అనొచ్చా...
వయసులో పెద్ద వారైనంతమాత్రాన ఏకవచనంతో సంభోదిస్తారా అని మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు. నువ్వు నువ్వు మీరు అనొచ్చు...మేం అనకూడదా? అని అన్నారు. "నేను పోలీసుల గురించే మాట్లాడానని మీకు మీరు అన్వయించుకోవడమేనా?గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరు భుజాలు తడుముకోవడం దేనికి? నేను సిఐ పేరు ఎక్కడైనా ప్రస్తావించానా? పంపుల దగ్గర తగాదాలతో మీకేం సంబంధం" అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.