పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్కులు కలపాలని

పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది

Update: 2026-04-04 02:40 GMT

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు దొర్లిన ప్రశ్నలకు మార్కులు కలపాలని ఎస్ఎస్సీ బోర్డు ప్రాథమికంగా నిర్ణ యించినట్లు తెలిసింది. హిందీ పరీక్షలో రెండు సరైన సమాధానాలు వచ్చిన ఓ ప్రశ్నకు రెండు మార్కులు కలపాలని, ఇంగ్లిష్ పరీక్షలో రెండు సరైన సమాధానాలు వచ్చిన మరో ఐదు మార్కుల ప్రశ్నకు ఐదు మార్కులు కలపాలని నిర్ణయించింది. అయితే ఈ మార్కులు కలిపే విధానం ఎలా ఉంటుందనే విషయాన్ని నేడు బోర్డు అధికారికంగా ప్రకటించనుంది.

నేడు అధికారికంగా...
అలాగే ఇంగ్లిష్ పరీక్షలో వర్క్ బుక్ నుంచి వచ్చిన 28వ ప్రశ్నకు కూడా మార్కులు కలపాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఐదు ప్రశ్నలకు మార్కులు కలపాలని పేరెంట్స్ అసోసియే షన్ రాష్ట్ర అధ్యక్షుడు శిఖరం నరహరి డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాల్లో లేని, పిలల్ని గందరగోళపరిచేలా ప్రశ్నలు ఇచ్చారని ఆయన అన్నారు.


Tags:    

Similar News