Amaravathi : నేడు అమరావతి ఏఐ సమ్మిట్

ఈరోజు విజయవాడ వేదికగా అమరావతి ఏఐ సమ్మిట్ జరగనుంది

Update: 2026-04-04 02:47 GMT

ఈరోజు విజయవాడ వేదికగా అమరావతి ఏఐ సమ్మిట్ జరగనుంది. కృత్రిమ మేధపై అవగాహన పెంచేందుకు, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌టీపీఐ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహణ చేస్తోంది. విద్యార్థులకు కెరీర్‌ పట్ల స్పష్టత, టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్‌ పెంచుకోవడంపై దిశానిర్దేశం చేస్తారు.

అతిపెద్ద ఏఐ సమ్మిట్ గా...
అమరావతి రీజియన్‌లో జరుగుతున్న అతిపెద్ద ఏఐ సమ్మిట్‌ ఇది. ఈ సమ్మిట్ కు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా హాజరు కానున్నారు. ఈ ఏఐ సమ్మిట్ లో నిపుణులు వచ్చి విద్యార్థుల సందేహాలకు కూడా సమాధానమిస్తారు. దీంతో భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ సమ్మిట్ కు హాజరు కానున్నారు.


Tags:    

Similar News