Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే గంటల పాటు వెయిట్ చేయాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ నేడు భారీగా పెరిగిం

Update: 2026-04-04 03:07 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు భారీగా పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి పోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. శనివారం కావడతో అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేసినట్లుగానే శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావించి ముందస్తు ఏర్పాట్లు చేశారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది.

శనివారం ఎక్కువ మంది...
తిరుమలకు వచ్చే భక్తులు శనివారం ఎక్కువ మంది వచ్చి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తహతహలాడుతారు. శనివారం వెంకటేశ్వరస్వామికి అత్యంత ఇష్టమైన రోజు కావడంతో ఆరోజు స్వామి వారిని దర్శించుకుంటే శుభం జరుగుతుందని భావిస్తారు. అందుకే శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే చేపట్టి, భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు కిలోమీటర్ల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది హేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు గంటలకుపైగానే పడుతుంది. నిన్న శ్రీవారిని 68,445 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు వచ్చిందని అధికారుల తెలిపారు. మొదటి మూడు నెలల్లో శ్రీవారిని దర్శించుకున్న 65 లక్షల మంది భక్తులు. మొదటి 3 నెలల్లో హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.356 కోట్ల రూపాయల వెల్లడించారు.


Tags:    

Similar News