రెండు రోజులు టీడీపీ నిరసనలు

తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు ఏపీలో నిరసనలు తెలియజేయాలని నిర్ణయించింది.

Update: 2022-03-18 13:21 GMT

తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు ఏపీలో నిరసనలు తెలియజేయాలని నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కల్తీసారా, జే బ్రాండ్ మద్యానికి వ్యతిరేకంగా ఆది, సోమ వారాల్లో ఆందోళనలను నిర్వహించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అక్రమ బ్రాండ్లను తెచ్చి మహిళల తాళిబొట్లను తెంచుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

జే బ్రాండ్ మద్యానికి.....
మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, గ్రామ స్థాయిలో మహిళలు, పార్టీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగాలని చంద్రబాబు పార్టీ క్యాడర్ ను ఆదేశించారు. జె బ్రాండ్ మద్యం నిషేధించాలి, కల్తీసారా అరికట్టాలన్న దిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. మద్యంలో కమిషన్ల ద్వారా 25 నుంచి ముప్ఫయి వేల కోట్ల రూపాయలను జగన్ సంపాదిస్తున్నాడని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.


Tags:    

Similar News