Perni Nani : చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్
చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు
కూటమి ప్రభుత్వం, చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. వైద్యాన్ని ప్రైవేట్‌పరం చేయాలని సర్కార్ చూస్తోందని ,ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం మాత్రమే చేస్తారని నాని అన్నారు. ప్రజల సమస్యలను చంద్రబాబుకు పట్టడంలేదన్న పేర్ని నాని పీపీపీ, పీ4తో ఎవరు బాగుపడ్డారో వారికే తెలియాలంటూ చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు.
అప్పనంగా దోచి పెడుతూ...
90 పైసలకే 50 కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారని, గూగుల్, TCS ఇంత చౌకగా ఎక్కడైనా భూములు తీసుకుందా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పేద్దోళ్ల పేరుతో భూములు దోచుకుంటున్నారన్న పేర్నినాని రాజధాని రైతులను సీఆర్డీఏ పట్టించుకోవడంలేదని, పేదలను, రాజధాని రైతులను నిలువునా ముంచేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు.