నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు

నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి.

Update: 2025-12-29 03:39 GMT

నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆన్ లైన్ లో టిక్కట్లను కేటాయించారు. లక్షలాది మంది ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ లక్కీడిప్ ద్వారానే కొందరిని ఎంపిక చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టోకెన్లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఏడు లక్షల మందికిపైగా...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు తిరుప్పావై పాశురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరవనున్నారు. తొలుత 1.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రారంభిస్తారు. తెల్లవారుజామున 5.30కు ఈ-డిప్లో టోకెన్లు పొందిన వారిని అనుమతిస్తారు. జనవరి 8వ తేదీ వరకు సుమారు 7.7 లక్షల మందికి దర్శనం కల్పించేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది.


Tags:    

Similar News