Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది

Update: 2025-12-29 02:03 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజనతో పాటు రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు ముప్ఫయికి పైగా అంశాలతో అజెండా సిద్ధమయినట్లు తెలిసింది.

జిల్లాల వర్గీకరణకు...
జిల్లాల వర్గీకరణలో మార్పులు చేర్పులు చేపట్టాలని ముఖ్యమంత్రి చేసిన సూచన మేరకు ఇరవై ఆరు జిల్లాలను ఇరవై ఎనిమిది జిల్లాలుగా చేసే ఛాన్స్ ఉంది. అలాగే మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసే రుషికొండ ప్యాలెస్ వినియోగంపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు పలు పారిశ్రామిక సంస్థలకు భూ కేటాయింపుల విషయంపై చర్చించి ఆమోదించనున్నారు. రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ఆమోదించిన పలు అంశాలకు మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది.


Tags:    

Similar News