Srisailam : శ్రీశైలంలో ఆన్ లైన్ టిక్కెట్లు హాట్ కేకుల్లా
శ్రీశైలం దేవస్థానంలో ఆన్‌లైన్ టిక్కెట్ విధానానికి అనూహ్య స్పందన భక్తుల నుంచి లభిస్తుంది.
నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఆన్‌లైన్ టిక్కెట్ విధానానికి అనూహ్య స్పందన భక్తుల నుంచి లభిస్తుంది. టిక్కెట్లను ఆన్ లైన్ లో భక్తులకు శ్రీశైలం దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆన్ లైన్ లో టిక్కెట్ల విక్రయానికి భారీగా భక్తుల స్పందించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. రికార్డు స్థాయిలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టికెట్ల విక్రయం జరిగిందని తెలిపారు.
ఒక్కరోజు ఆదాయం...
ఒక్కరోజులోనే శ్రీశైలం ఆలయానికి రూ.1.46 కోట్ల ఆదాయం వచ్చిందని శ్రీశైలం దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావువెల్లడించారు. వాట్సాప్‌లో ‘మనమిత్ర’ ద్వారా భక్తులు ఆర్జిత సేవల టికెట్లు పొందే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. నూతన ఏడాది రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశముందని భావించి అందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు.