Rain Alert : నేడు కూడా అతి భారీ వర్షాలు.. అల్పపీడన ప్రభావం ఫలితం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది

Update: 2025-08-27 04:00 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడుతుందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు పలు జిల్లాల్లో పిడుగులు కురిసే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.

అతి భారీ వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కూడా అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కాకినాడ, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.
తెలంగాణలోనూ...
తెలంగాణలోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ములుగు, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు మరికొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.



Tags:    

Similar News