Andhra Pradesh : ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరి 24 నుంచి మార్చి25 వ తేదీవరకూ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ఇంటర్ పరీక్ష ల షెడ్యూల్ ను విడుదల చేసింది.
ముందుగానే ప్రకటించి...
ఇంటర్ పరీక్షలను ముందుగానే ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు విద్యార్థులు అవసరమైన ప్రిపరేషన్ అవుతారని భావిస్తుంది. ఈ లోపు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం సిలబస్ ను పూర్తి చేసి విద్యార్థులకు ప్రీ ఎగ్జామ్స్ నిర్వహించి వారిని పరీక్షలకు సన్నద్ధులను చేయాలని సూచించారు.