Nara Lodkesh : విశాఖ ఐటీ ప్రాజెక్టులపై కేసులు పెరుగుతున్నాయన్న ఐటీ మంత్రి వ్యాఖ్యలు

రాష్ట్రంలో కీలక ఐటీ పార్క్ ప్రాజెక్టులపై వరుసగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలవుతుండటంపై ఐటీ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2025-12-19 06:58 GMT

రాష్ట్రంలో కీలక ఐటీ పార్క్ ప్రాజెక్టులపై వరుసగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలవుతుండటంపై ఐటీ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి యువత ఉద్యోగ అవకాశాలకు గట్టి దెబ్బగా మారుతున్నాయని చెప్పారు. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ , కాగ్నిజెంట్‌, సత్త్వ గ్రూప్‌, రహేజా కార్ప్‌ ఐటీ పార్క్ ప్రాజెక్టులపై పీఐఎల్‌లు నమోదయ్యాయని లోకేశ్ పేర్కొన్నారు.

లక్షకు పైగా ఉద్యోగాలు...
టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, సత్త్వా, ఇప్పుడు రహేజా ఐటీ పార్క్‌లపై పీఐఎల్‌లు వేశారన్నారు. ఇవన్నీ కలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఒక లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని, యువత భవిష్యత్తుపై ఇంత ద్వేషం ఎందుకు? ప్రతి అడుగులోనూ ఏపీని ఎందుకు అడ్డుకుంటున్నారు?” అని లోకేశ్ ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను వైఎస్సార్‌సీపీ ఖండించింది. పీఐఎల్‌లతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ లీగల్ సెల్‌కు చెందిన మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు.


Tags:    

Similar News

.