జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ అసంతృప్తి

జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ వన్ టూ వన్ సమావేశం నిర్వహించారు

Update: 2025-12-19 12:07 GMT

తొమ్మిది మంది జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ వన్ టూ వన్ సమావేశం నిర్వహించారు. తొలుత అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. అనంతరం పంతం నానాజీ, గిడ్డి సత్యనారాయణ, లోకం నాగమాధవి, దేవ వరప్రసాద్, సీహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయకుమార్ లతో చర్చించారు. ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ వారికి క్లాస్ తీసుకున్నారు.

ఒక్కో ఎమ్మెల్యేతో 30 నిమిషాలకు...
ఒక్కో ఎమ్మెల్యేతో 30 నిమిషాలకు పైగా పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల రిపోర్ట్స్ తెప్పించుకుని, ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఎమ్మెల్యేలతో జనసేనాని మాట్లాడారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పనితీరును మెరుగుపర్చుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. కూటమి నేతల మధ్య సమన్వయం అవసరమనితెలిపారు.


Tags:    

Similar News

.