Chandrababu ఆర్థిక మంత్రికి చంద్రబాబు చిట్టా ఇదే
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. • కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పూర్వోదయతో గ్రోత్ ఇంజన్ గా ఏపీ తయారవుతుందని తెలిపారు. దేశంలోని తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే పూర్వోదయ పథకం వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకునేందుకు, జాతీయ ఆర్ధిక వ్యవస్థకు చోదకశక్తిగా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
రానున్న బడ్జెట్ లో...
గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ, సాగునీటి పారుదల వ్యవస్థల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల నిర్మాణం, విద్య వైద్య రంగాల సదుపాయాల కల్పన కోసం పూర్వోదయ పథకం కీలకంగా మారుతుందని చంద్రబాబు తెలిపారు. ఈ పథకం కింద ప్రాధాన్యతా క్రమంలో చేపట్టే ప్రాజెక్టులకు పాలనాపరమైన నిబంధనల్ని సరళీకృతం చేయాలని ..రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటిని వినియోగించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి పత్రాన్ని అందించారు. రానున్న బడ్జెట్ లో ఏపీకి అదనపు నిధులు కేటాయించాలని కోరారు. నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు.