Andhra Pradesh : పింఛను దారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛను దారులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-12-19 04:47 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛను దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఏడాది కానుకను అందించాలని నిర్ణయించింది. జిల్లకు అదనంగా మరో 200 కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కీలక నిర్ణయాన్నితీసుకున్నారు. అర్హులైన వారందరికీ కూటమి ప్రభుత్వం పింఛన్లను అందచేయాలని నిర్ణయించిందని, అర్హులైన వారిని గుర్తించి పింఛనును మంజూరు చేయాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు.

ప్రతి నెల మొదటి తేదీన...
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత వృద్ధులు వితంతవులకు నెలకు నాలుగు వేల రూపాయలు పింఛను చెల్లిస్తుంది. దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు నెలకు చెల్లిస్తుంది. మంచానికే పరిమితమయిన వారికి పదిహేను వేల రూపాయలు అందచేస్తుంది. ప్రతి నెల మొదటి తేదీన పింఛనను ఠంఛనుగా లబ్దిదారులకు అందచేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది మాత్రమే కాకుండా రెవెన్యూ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
జిల్లా కలెక్టర్లకే అధికారం...
ఈ సందర్భంగా వచ్చిన వినతులను పరిశీలించిన చంద్రబాబు జిల్లాకు అదనంగా రెండు వందల పింఛన్లను మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం, జిల్లాకు 200 కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఈ పెన్షన్ల మంజూరుపై ఇన్ఛార్జ్ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు. బాధితులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది


Tags:    

Similar News

.