Pawan Kalyan : నేడు నిడదవోలులో పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-12-20 02:27 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నిడదవోలులో పవన్ కల్యాణ్ పర్యటన జరుగుతుంది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అలాగే పవన్ కల్యాణ్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా సమావేశం కానున్నారు.

వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును...
నిడదవోలులో 1,400 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును పవన్ కల్యాణ్ నేడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు పలువురు కూటమి పార్టీ నేతలు పాల్గొంటారు. అక్కడ స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా పవన్ పాల్గొననున్నారు. పవన్ రాక సందర్భంగా భారీ ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకుంటారని తెలిసి విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News