ఏపీని అలెర్ట్ చేసిన వాతావరణ శాఖ.. మరికొద్ది రోజుల్లో....?

ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తినష్టం ఎక్కువగా జరిగింది

Update: 2021-11-22 02:13 GMT

ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. వారం రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తినష్టం ఎక్కువగా జరిగింది. ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టాలన్నా వర్షాలు వీలుపడనీయడం లేదు. అయితే గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు మరింత ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ తేల్చి చెప్పింది. భారీ వర్షాలకు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం జరిగింది. రైళ్లను కూడా నిలిపేయాల్సి వచ్చింది.

మరో అల్పపీడనం....
ఈ పరిస్థితుల్లో దక్షిణ అండమాన్ వద్ద మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది అల్పపీడనంగా మారి వాయువ్యదిశగా కదిలే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రభావంతో మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 26వ తేద నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు మళ్లీ వానగండం పొంచి ఉంది.


Tags:    

Similar News