Nara Lokesh : నేడు రాజమండ్రికి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమండ్రిలోని ప్రభుత్వ కళాశాలలోని నూతన భవనాల ప్రారంభోత్సవంలో నారా లోకేశ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడతారు. వారి సమస్యలను అడిగిత తెలుసుకుని పరిష్కరించేదిశగా ప్రయత్నిస్తారు.
విద్యార్థులతో ముఖాముఖి...
విద్యార్థులు అడిగే ప్రశ్నలకు నారా లోకేశ్ సమాధానం చెబుతారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నూతన భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం నారా లోకేశ్ తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేతలతో సమావేశమవుతారు, పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. నారాలోకేశ్ రాక సందర్భంగా భారీగా పార్టీ శ్రేణులు హాజరు కానున్నారు.