నేటి నుంచి రెండోదశ అటల్ మోదీ సుపరిపాలన బస్సుయాత్ర
నేటి నుంచి రెండోదశ అటల్ మోదీ సుపరిపాలన బస్సుయాత్ర ప్రారంభం కానుంది
నేటి నుంచి రెండోదశ అటల్ మోదీ సుపరిపాలన బస్సుయాత్ర ప్రారంభం కానుంది. శ్రీకాకుళం నుంచి బస్సుయాత్ర ప్రారంభంకానుంది. బస్సుయాత్రకు మంత్రి అచ్చెన్నాయుడు హాజరుకానున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఏపీలో అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర జరుగుతుంది. ధర్మవరం నుంచి ప్రారంభమయిన యాత్ర నేడు శ్రీకాకుళం నుంచి రెండో విడత ప్రారంభం కానుంది.
విజయనగరం సభకు...
అయితే విజయనగరం సభకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరు కానున్నారు. రేపు విశాఖలో సభకు బండి సంజయ్ హాజరుకానున్నారు.22న భీమవరంలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, బీజేపీ, టీడీపీ, జనసేన కార్యర్తలు హాజరు కానున్నారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు.