గవర్నర్ తో జగన్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Update: 2022-02-28 13:20 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మార్చి 7వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదేరోజు ఉభయ సభల నుంచి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్ తో చర్చించేందుకు జగన్ భేటీ అయ్యారు.

మంత్రి వర్గ విస్తరణపైన కూడా...?
అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు గవర్నర్ తో వివిధ రాజకీయ అంశాలను కూడా జగన్ చర్చించే అవకాశముంది. ప్రధానంగా జగన్ అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేసే అవకాశముందని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో మంత్రివర్గంలో కీలక శాఖ ఖాళీ అయింది. ఈ శాఖను వేరే వారికి అప్పగించేకన్నా త్వరగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టి పూర్తి స్థాయి మంత్రిని ఈ శాఖకు నియమించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని తెలిసింది.


Tags:    

Similar News