సినీనటి జయసుధ తిరిగి రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతుంది. జయసుధ గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ జయసుధ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. గతంలో సికింద్రాబాద్ శాసనసభ్యురాలిగా జయసుధ పనిచేశారు. నాడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలిగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ శాసనసభ్యురాలిగా ఐదేళ్ల పాటు కొనసాగారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి పెద్ద యెత్తున్ నిధులు తెచ్చుకున్నారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జయసుధకు కాంగ్రెస్ సీటు దక్కింది. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ లో కొనసాగిన జయసుధ తర్వాత ఏ పార్టీలోనూ చేరలేదు. కాంగ్రెస్, వైసీపీ, బీజేపీలో చేరిన జయసుధ ఇప్పుడు ఏ పార్టీలో చేరనున్నారన్నది మాత్రం తెలియరాలేదు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా...
తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలివుడ్ లో స్థిరపడ్డారు. అయితే ఆమె ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పడు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో పాటు వైఎస్ మరణం తర్వాత జయసుధ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అయితే కొంత కాలం క్రితం తెలంగాణకు చెందిన ఓ నిర్మాతతో కలిసి జయసుధ బీజేపీ నేత కిషన్‌రెడ్డిని కలిసినప్పుడు ఆమె బీజేపీ లో చేరతారని ప్రచారం జరిగింది. బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరకి సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జయసుధ పోటీ చేసే అవకాశం ఉందని అప్పట్లో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. తర్వాత వైసీపీలో చేరారు. కండువా కప్పుకున్నారు. తర్వాత ఆ పార్టీకి కూడా దూరంగానే ఉన్నారు. రాజకీయాలకు స్వస్తిచెప్పి సినిమాల్లో బిజీగా మారారు. కానీ తాజాగాఆమె తిరిగి రాజకీయాల్లోకి వస్తారని, అదీ ఏపీ నుంచి రాజకీయాల్లోకి వస్తారని చెబుతున్నారు.
ఏపీ నుంచే పోటీ చేస్తారా?
సహజనటి జయసుధ సొంత గ్రామం కృష్ణా జిల్లాలోనే ఉంది. అందుకే జయసుధ ఏపీ రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారంటున్నారు. కానీ జయసుధ మాత్రం తాను రాజకీయాల్లోకి వచ్చే విషయాన్ని కొట్టిపారేయడం లేదు. తనను రాజకీయాలలోకి ఎవరైనా ఆహ్వానిస్తే వస్తానని ఆమె తాజాగా మీడియాకు చెప్పడం విశేషం. తనకు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని, అయితే ఏ పార్టీలో చేరేదీ తాను చెప్పలేనని జయసుధ అన్నారు. రాజకీయాల్లోకి రావాలని కోరితే వస్తానని జయసుధ అనడంతో ఆమె ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ కొబ్బరి తోటలు ఎండిపోవడానికి, తెలంగాణ దిష్టి వ్యాఖ్యలను తప్పుపట్టారు. అదే సమయంలో ఎక్కడా మతమార్పిడులు జరగడం లేదని చెప్పడంతో జయసుధ చూపు వైసీపీ వైపు ఉందా? లేక టీడీపీ లో చేరతారా? అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.