Chandrababu : వచ్చే నెలలో చంద్రబాబు దావోస్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ఖరారయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ఖరారయింది. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీన చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరి వెళతారు. అక్కడ జరిగే ఎకనామిక్ సదస్సుకు హాజరు కానున్నారు. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగుతుంది.
పెట్టుబడులను ఆకట్టుకునే దిశగా...
ఐదు రోజుల పాటు దావోస్ పర్యటనలో ఉండనున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల రాయితీని అక్కడ తెలియజేస్తారు. వారితో ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఏపీకి అనుకూలమైన వాతావరణాన్ని కూడా ఆయన దావోస్ పర్యటనలో ప్రస్తావించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంట మంత్రులు లోకేశ్, టీజీ భరత్ లతో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనకు వెళతారు.