ముగ్గురు సీఎంలు చదివిన కాలేజ్
గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదువుకున్న ఎంతో మంది వివిధ రంగాల్లో రాణించారు..
గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదువుకున్న ఎంతో మంది వివిధ రంగాల్లో రాణించారు.. రాణిస్తూ ఉన్నారు. 1885 లో మద్రాసు విశ్వవిద్యాలయం, ఆ తర్వాత ఆంధ్ర, 1976 నుంచి ఆచార్య నాగార్జున వర్సిటీకి అనుబంధంగా కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కాసు బ్రహ్మానందరెడ్డి, భవనం వెంకటరామిరెడ్డి ఈ కళాశాలలోనే చదువుకున్నారు. సినీ దర్శకుడు కె. విశ్వ నాథ్, నటులు శోభన్ బాబు, జగ్గయ్య, గుమ్మడి, సాహితీవేత్తలు, కవులు కరు ణశ్రీ, జంధ్యాల పాపయ్యశాస్త్రి, గుర్రం జాషువా ఇక్కడ చదువుకున్న వారే. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ ఈ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహించారు. 2025-26 విద్యాసంవత్సరంతో కళాశాల 140 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ప్రైవేటు, కార్పొ రేట్ కళాశాలల హవా కొనసాగుతున్న ప్రస్తుత రోజుల్లోనూ 2 వేల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు.