Nara Lokesh : అమెరికాలో కొనసాగుతున్న లోకేశ్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పర్యటన అమెరికాలో కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పర్యటన అమెరికాలో కొనసాగుతుంది. ఏపీలో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేయాలని మంత్రి లోకేశ్ కోరారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. ఐటీ, డేటా హబ్‌గా విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఏపీలో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేయాలని లోకేశ్ కోరారు. సెమీకండక్టర్, AI, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలంటూ వారిని ఆహ్వానించారు.
పెట్టుబడులు పెట్టేందుకు...
పలు కంపెనీలకు ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్త ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా చెప్పారు. పరిశ్రమలకు నేరుగా ప్రోత్సాహకాలను అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో అకౌంట్ విధానాన్ని ప్రారంభించామని మంత్రి లోకేశ్ తెలిపారు. పెట్టుబడులకు ముందుకు రావాలంటూ నారా లోకేశ్ ఆహ్వానం పలికారు. అమెరికా పర్యటన తర్వాత లోకేశ్ కెనడాలో పర్యటిస్తారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమై పెట్టుబడులను ఆహ్వానించనున్నారు.