ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతుంది. ఈ వ్యాధితో మరణాలు సంభవిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. గుంటూరు, ప్రకాశం, విజయనగరం, చిత్తూరు వంటి జిల్లాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వ్యాధిని వెంటనే గుర్తించి సరైన చికిత్స సరైన సమయంలో అందుకుంటే ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారక. స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇది చిన్న పురుగులు కుట్టడం ద్వారా సోకుతుంది. ఈ వ్యాధి సోకితే జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు, మరియు కాటు వేసిన చోట నల్లటి పుండు వంటి లక్షణాలు కనిపిస్తాయి, సరైన సమయంలో చికిత్స చేయకపోతే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. నిన్న గుంటూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒకరు స్క్రబ్ టైఫస్ వ్యాధితో మరణించారు. రాష్ట్రంలో 1,564 కేసులు నమోదయ్యాయి. పేడ పురుగు వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది.
జ్వరంతో మొదలయ...
ఈ వ్యాధి వేగంగా జ్వరంతో మొదలవుతుంది. తక్షణ పరీక్ష, సమయానికి యాంటీబయోటిక్ చికిత్స ప్రారంభిస్తే పరిస్థితిని నియంత్రించవచ్చని వైద్యులు తెలిపారు. గడ్డి, పొలాలు, చెట్ల వద్ద ఉండే చిన్న చిగర్ పురుగుల కాటుతో ఈ బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. శరీర రక్షణ వ్యవస్థ పనితీరును ఇది దెబ్బతీస్తుంది. తీవ్ర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉండటంతో కారణాలు, లక్షణాలు, చికిత్స మార్గాలు, నివారణ జాగ్రత్తలు తెలుసుకోవడం ముఖ్యం. అందుకే గడ్డి వాములు, పొలం పనులకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏమాత్రం జ్వరం వచ్చినా వెంటనే సరైన వైద్యుడిని సంప్రదించి దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
స్క్రబ్ టైఫస్ లక్షణాలివే
ఇన్ఫెక్షన్ మొదలైన కొన్ని రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం: అకస్మాత్తుగా వచ్చిన అధిక జ్వరం ఈ వ్యాధికి ముఖ్య సూచన. తలనొప్పి, నొప్పులు: కండరాలు, కీళ్లలో గట్టిగా నొప్పి, వణుకులు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి క్రమంగా పెరిగి వెలుతురు చూస్తే ఇబ్బంది కలుగుతుంది. అలాగే శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. దగ్గు, శ్వాసలో ఇబ్బంది కనిపించొచ్చు. ఇవి శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌లను పోలి ఉంటాయి. మలబద్ధకం, విరేచనాలు, మలినం, కడుపు నొప్పి వంటివి కనిపిస్తాయి. తీవ్రమైన అలసట, రోజువారి పనులు చేయడంలో ఇబ్బంది కలుగుతుంది.చికిత్స ఆలస్యం అయితే కాలేయం, మూత్రపిండాల పనితీరు తగ్గే ప్రమాదం. ఉందని వైద్యులు తెలిపారు.
చికిత్స ఎలా ?
సరైన సమయంలో గుర్తిస్తే స్క్రబ్ టైఫస్ నియంత్రణలోకి వస్తుంది. డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ వంటి యాంటీబయోటిక్స్ మందులతో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.తొలిదశలో లక్షణాలు మొదలైన వెంటనే పరీక్ష చేయించుకుంటే చికిత్స త్వరగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. నొప్పి నివారణ మందులు, ద్రవాలు తీసుకోవడం వలన శరీరం త్వరగా కోలుకుంటుంది. సమయానికి వైద్యం అందేలా చూసుకోవాలని. చికిత్స ఆలస్యం అయితే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రావొచ్చు.అడవి, గడ్డివనం ప్రాంతాలకు వెళ్తే ఫుల్‌స్లీవ్ దుస్తులు, షూలు ధరించాలి. గడ్డి ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, అడవి ప్రాంతాలు అవసరం లేకుండా వెళ్లకుండా చూసుకోవాలి. పురుగులు ఉన్నాయా చూడాలి: బయట తిరిగివచ్చిన తర్వాత దుస్తులు, బూట్లు బాగా చూసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచితే చిగర్ పురుగుల ప్రమాదం తగ్గుతుంది.