నేడు విశాఖ మేయర్ ప్రమాణ స్వీకారం.. సుదీర్ఘకాలం తర్వాత?
నేడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగనుంది
నేడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే వైసీపీ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నేడు కొత్త మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఇప్పటీకే తెలుగుదేశం పార్టీ పీలాశ్రీనివాస్ పేరును ఖరారు చేసింది. దీంతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పై సుదీర్ఘకాలం తర్వాత టీడీపీ జెండా ఎగురనుంది.
మేయర్ అభ్యర్థిగా...
మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ కు అధిష్టానం బీఫారం కూడా ఇవ్వడంతో నేడు ఆయన ఎన్నిక లాంఛనమే. విశాఖ మేయర్ గా పీలా శ్రీనివాస్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏడాది మాత్రమే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉదయం పదకొండు గంటలకు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశమై మేయర్ ప్రమాణ స్వీకారంతో పూర్తవుతుంది. విశాఖ డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు ఇచ్చే అవకాశముంది.