India vs South Africa : నేడు భారత్ - దక్షిణాఫ్రికా మూడో వన్డే.. విశాఖ స్టేడియం ఎవరికి అనుకూలం?

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేడు వన్డే సిరీస్ ను డిసైడ్ చేసే మ్యాచ్ జరగనుంది

Update: 2025-12-06 04:19 GMT

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేడు వన్డే సిరీస్ ను డిసైడ్ చేసే మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నంలో జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. అయితే రెండు వన్డే మ్యాచ్ లను పరిశీలిస్తే దక్షిణాఫ్రికాతో పోలిస్తే భారత్ బలహీనంగానే కనిపిస్తుంది. గతంలో మాదిరిగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లలో అంత పదును లేదు. ఇద్దరు ముగ్గురు బ్యాటర్లు మాత్రమే క్లిక్ అవుతున్నారు. దీంతో భారీ స్కోరు చేయాల్సిన భారత్ అంది వచ్చిన అవకాశాన్ని వదులుకునే పరిస్థితి ఏర్పడింది. ఓపెనర్ గా దిగుతున్న యశస్వి జైశ్వాల్ పేలవ ప్రదర్శనతో టీం ఇండియాకు భారంగా మారాడని చెప్పకతప్పదు.

లోయర్ ఆర్డర్ వైఫల్యం...
ఇక బ్యాటర్లలో ఆల్ రౌండర్లుగా చెప్పుకునే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లు కూడా మెరుగైన ప్రదర్శనను చూపడం లేదు. దీనికి కారణం ఫామ్ లో లేకపోవడమా? మరేదైనా అన్నది తెలియాల్సి ఉంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లు సీనియర్ ఆటగాళ్లుగా తమ శక్తి కొద్దీ స్కోరును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరో సీనియర్ ఆటగాడు, కెప్టెన్ కేఎల్ రాహుల్ సయితం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ ముగ్గురు తప్పించి మిగిలిన బ్యాటర్లలో చెప్పుకోదగిన ఆటతీరు కనిపించడం లేదన్నది అందరినోట వినిపిస్తున్న మాట. లోయర్ ఆర్డర్ ఘోరంగా విఫలమవుతుంది.
బౌలింగ్ లోనూ అంతే...
మరొకవైపు బౌలింగ్ లో కూడా జస్ప్రిత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. అర్ష్ దీప్ సింగ్ ఒక్కడే పరవాలేదనిపిస్తున్నాడు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.వికెట్లు కూడా సరైన టైంలో తీయలేకపోయారు. అలాగే కులదీప్ యాదవ్, జడేజా లు కూడా రాయపూర్ మ్యాచ్ లో బంతిని తిప్పలేకపోయారు. వెరసి భారత్ కేవలం అన్ని విభాగాల్లో బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. దక్షిణాఫ్రికాను ఎదుర్కొనడం సాధారణ విషయం కాదు. ఆ టీం పూర్తిగా లోయర్ ఆర్డర్ వరకూ స్ట్రాంగ్ గా ఉంది. ఈ విషయాలను గమనించి నేటి మ్యాచ్ లోనైనా టీం ఇండియా ఆచితూచి ఆడాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే విశాఖ స్టేడియం మాత్రం భారత్ కు అచ్చివచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


Tags:    

Similar News