Nara Lokesh : విశాఖకు చేరుకున్న నారా లోకేష్
అమెరికా, కెనడా పర్యటన పూర్తి చేసుకొని మంత్రి నారా లోకేష్ విశాఖ చేరుకున్నారు
అమెరికా, కెనడా పర్యటన పూర్తి చేసుకొని మంత్రి నారా లోకేష్ విశాఖ చేరుకున్నారు. నేడు కాగ్నిజెంట్ తో పాటు 9 మంది ఐటీ సంస్థలకు భూమి పూజ జరగనుండటంతో ఆయన నేరుగా విశాఖపట్నంకు చేరుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయం లో లోకేష్ కు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
పార్టీ కార్యాలయంలో...
విశాఖ విమానాశ్రయం నుండి విశాఖ లోని పార్టీ కార్యాలయానికి మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు విశాఖలో కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న అనంతరం ఆయన అమరావతికి బయలుదేరే అవకాశముంది.