Chandrababu : నేడు విశాఖకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంకు వెళ్లనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంకు వెళ్లనున్నారు. వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. కాగ్నిజెంట్ తో పాటు మరో తొమ్మిది ఐటీ కంపెనీలకు సంబంధించిన శంకుస్థాపనలు చేయడానికి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ ఐటీ పరిశ్రమల భవనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ నిర్వహించనున్నారు.
విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశానికి...
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. చంద్రబాబు విశాఖ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు కూడా భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఈ కార్యక్రమాల తర్వాత విశాఖ నుంచి హైదరాబాద్ కు వెళ్లే అవకాశాలున్నాయి.