Chandrababu : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే రెండేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయని తెిపారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. రాప్తాడులో వస్త్ర పరిశ్రమ రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
ఇరవై లక్షల ఉద్యోగాలు...
అనంతపురం జిల్లా టేకులోడులో ఏరో స్పేస్ పరిశ్రమ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ఒప్పందాలతో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని, రెండేళ్లలో పరిశ్రమలు పూర్తి చేయాలని కోరుతున్నామని తెలిపారు. రాయలసీమకు స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ వస్తున్నాయన్న చంద్రబాబు రాయలసీమలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ పరిశ్రమలు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. రాయలసీమలో బ్యాటరీ ఉత్పత్తి పరిశ్రమలు కూడా వస్తున్నాయని, ప్రపంచ డేటా సెంటర్ గా విశాఖ మారనుందని, ప్రస్తుతం పర్యాటకరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.