Visakha : విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళన
విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం భూములిచ్చిన రైతులకు ఇప్పటి వరకూ న్యాయం జరగలేదంటూ ఆందోళనకు దిగారు. తమ సుదీర్ఘమైన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ వారు ఆందోళనకు దిగారు.
భూములిచ్చిన తమకు...
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తాము భూములిస్తే తమకు ప్లాంట్ లో ఉద్యోగాలు ఇవ్వలేదని, మరొక చోట భూమిని కేటాయించడం లేదంటూ నిర్వాసితులందరూ ఆందోళనకు దిగారు. దాదాపు 8,500 మంది భూ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ వారు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా పోలీసులను మొహరించారు.